: వ్యోమగాములకు క్యాన్సర్ రాకుండా సరికొత్త పరిశోధనలు
సాధారణంగా అంతరిక్షంలో ఉండే తీవ్రమై అయనైజింగ్ రేడియోక్టివిటీ 56ఎఫ్‌ఈ రేడియేషన్ వలన బీటా కెటానిన్ అనే క్యాన్సర్ జన్యువు యాక్టివ్ అవుతుంది. దీనివల్ల మలద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్పిడి చేసిన ఎలుకలపై ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని నిర్ధరించిన శాస్త్రవేత్తలు, భవిష్యత్తులో వ్యోమగాముల్ని పంపేప్పుడు ఈ బెడద ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి పరిశోధనలు సాగిస్తున్నారు. అంగారక గ్రహ యాత్ర వంటి సుదూర యాత్రల సమయంలో వ్యోమగాములకు క్యాన్సర్ వంటి ప్రమాదాలు సోకకుండా జాగ్రత్తలను రూపొందిస్తారు. నాసా ఆధ్వర్యంలో జరిగే ఈ పరిశోధనలకు భారత సంతతికి చెందిన శుభాంకర్ సుమన్, కమల్ దత్తాలే నేతృత్వం వహిస్తుండడం గమనార్హం.