: అమ్మాయిలు పబ్బుకెళ్ళడంపై గోవా మంత్రి ఆందోళన!
అమ్మాయిలు చిట్టిపొట్టి డ్రెస్సుల్లో పబ్బుల బాట పట్టడం మన సంస్కృతికి వ్యతిరేకమని గోవా మంత్రి సుదిన్ ధవాలికర్ వ్యాఖ్యానించారు. అలాంటి అలవాట్లకు స్వస్తి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే గోవా సంస్కృతి ఏం కానుంది? అని ధవాలికర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకుని పబ్బులకెళ్ళడం ద్వారా అమ్మాయిలు తప్పుడు సంస్కృతికి బీజాలు వేసినవాళ్ళవుతారని ఆయన పేర్కొన్నారు. దీన్ని ఇంతటితో నిలిపివేయాలని పిలుపునిచ్చారు.