: శాసనమండలి చైర్మన్ పదవికి నేడు స్వామిగౌడ్ నామినేషన్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విధేయుడు స్వామిగౌడ్ నేడు శాసనమండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు రహస్య ఓటింగ్ విధానంలో తెలంగాణ శాసనమండలికి చైర్మన్ ను ఎన్నుకుంటారు. క్లాస్ ఫోర్ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించిన స్వామిగౌడ్ ఉద్యోగసంఘం నాయకుడిగా ఎదిగారు. అటుపై, రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేస్తూ ముందుకు వెళుతుండడం నిజంగా విశేషమే.