: నేడు ఏసీబీ కోర్టు ఎదుటకు ధర్మాన తనయుడు
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు నేడు విశాఖ ఏసీబీ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఆయన మద్యం ముడుపుల వ్యవహారంలో నిందితుడిగా ఉన్నారు. అటు, ధర్మాన సైతం వాన్ పిక్ భూముల వ్యవహారంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ కేసు నిందితుల్లో ధర్మాన కూడా ఒకరని సీబీఐ తన ఛార్జిషీట్లలో పేర్కొంది.