: కన్నుల పండువగా సాగిన నందుల ప్రదానోత్సవం
రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని తెలుగు లలిత కళాతోరణంలో ఈ సాయంత్రం జరిగిన ప్రదానోత్సవం కళ్ళుచెదిరే రీతిలో సాగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు విజేతలకు నంది పురస్కారాలు అందజేశారు.
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన దూకుడు చిత్రం ఏడు నందులు కైవసం చేసుకుంది. దూకుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు, ఉత్తమ సహాయనటుడిగా ప్రకాశ్ రాజ్ , ఉత్తమ హాస్యనటుడిగా ఎంఎస్ నారాయణ, ఉత్తమ స్క్రీన్ ప్లే శ్రీను వైట్ల, ఉత్తమ ఫైట్ మాస్టర్ విజయ్ అవార్డులు అందుకున్నారు. అంతేగాకుండా దూకుడుకు ఉత్తమ ఎడిటింగ్, అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం అవార్డులు కూడా దక్కాయి.
కాగా, జై బోలో తెలంగాణ చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎంపికైన ప్రజా గాయకుడు గద్దర్ అవార్డును తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇక ద్వితీయ ఉత్తమ చిత్రంగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన రాజన్న స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో తెలంగాణ లో రజాకార్ల దురాగతాలను అడ్డుకునే వీరుడిగా అద్భుత నటన కనబర్చిన నాగార్జున కూడా ప్రత్యేక జ్యూరీ పురస్కారం అందుకున్నాడు.
ఇక ఇతర విభాగాల్లో అవార్డు గ్రహీతల వివరాలు.. ఉత్తమ చిత్రం: శ్రీరామరాజ్యం ఉత్తమనటి: నయనతార (శ్రీరామరాజ్యం) ఉత్తమ నేపథ్య గాయని: మాళవిక (రాజన్న) తృతీయ ఉత్తమ చిత్రం: విరోధి ఉత్తమ కుటుంబకథాచిత్రం: 100 పర్సెంట్ లవ్
ఉత్తమ దర్శకుడు: ఎన్ శంకర్ (జై బోలో తెలంగాణ) జాతీయ సమైక్యత అవార్డు: ఎన్ శంకర్ (జై బోలో తెలంగాణ) ఉత్తమ క్యారెక్టర్ నటుడు: సమ్మెట గాంధీ (రాజన్న) ఉత్తమ విలన్: మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు) ఉత్తమ బాలనటుడు: నిఖిల్ (100 పర్సెంట్ లవ్) ఉత్తమ బాలనటి: బేబీ యానీ (రాజన్న
) ఉత్తమ మొదటి చిత్రం దర్శకుడు: భాను ప్రకాష్ (ప్రయోగం) ఉత్తమ మాటల రచయిత: నీలకంఠ (విరోధి) ఉత్తమ పాటల రచయిత: మిట్టపల్లి సురేందర్ (పోరు తెలంగాణ) ఉత్తమ కొరియోగ్రాఫర్: శ్రీనివాస్ (శ్రీరామరాజ్యం) ఉత్తమ సౌండ్ రికార్డిస్ట్: దేవీకృష్ణ
ఉత్తమ కాస్టూమ్య్ డిజైనర్: అన్వర్ భాష(అనగనగా ఓ ధీరుడు) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్: ఆర్సీఎమ్ రాజు (పోరు తెలంగాణ) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్: సునీత (శ్రీరామరాజ్యం) ఉత్తమ సినీ రచన: కె. ఈశ్వర్రావు (సినిమా పోస్టర్) ఉత్తమ విమర్శకుడు: రెంటాల జయదేవ్