: కీలక సమరంలో మెస్సీ మెరిసేనా?
బ్రెజిల్లో జరుగుతున్న సాకర్ ప్రపంచ సమరం కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. నేటి మ్యాచ్ లలో అర్జెంటీనా, స్విట్జర్లాండ్ రాత్రి 9.30కి తలపడుతుండగా, బెల్జియం, అమెరికా జట్లు రాత్రి 1.30కి పోటీపడనున్నాయి. కాగా, గ్రూప్ దశలో స్థాయికి తగ్గ ప్రదర్శనతో విమర్శకుల నోళ్ళు మూయించిన అర్జెంటీనా స్టార్ ఫార్వర్డ్ మెస్సీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. స్విస్ జట్టుతో పోరులోనూ మెస్సీ మెరిస్తే తమకు తిరుగులేదని అర్జెంటీనా వ్యూహకర్తలతో పాటు ఫ్యాన్స్ భావిస్తున్నారు.