: ఆంధ్రప్రదేశ్ పోలీసుల యూనిఫాం మార్చే ప్రసక్తే లేదు: డీజీపీ జేవీ రాముడు
ఆంధ్రప్రదేశ్ పోలీసుల యూనిఫాంను మార్చే ప్రసక్తే లేదని, ప్రస్తుతం ఉన్న యూనిఫాంను యథాతథంగా కొనసాగిస్తామని డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎర్రచందనం అక్రమ రవాణాలో ఏ రాజకీయ పార్టీకి సంబంధమున్నా వారిని వదిలిపెట్టమని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడిన వారి వివరాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు త్వరలో తిరుపతి పట్టణంలో కమిషనరేట్ ఏర్పాటు చేస్తామని రాముడు చెప్పారు.