: మధ్యలో ఉంటే మాత్రం మాకేం?: తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి


విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న విద్యార్థుల ఫీజులతో తమకు సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఫీజు రీఎంబర్స్ మెంటు విషయంలో గత ప్రభుత్వాల సంప్రదాయాలను పాటించమని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీఎంబర్స్ మెంట్ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. 1956కు ముందు తెలంగాణ వారై ఉండాలన్నది ఫీజు రీఎంబర్స్ మెంటుకు ఒక ప్రాతిపదిక మాత్రమేనని ఆయన తెలిపారు. ఏపీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వమే ఫీజు రీఎంబర్స్ మెంటు ఇవ్వాలని చంద్రబాబు వింతగా వాదిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News