: ఇరాక్ నుంచి 60 మందిని తీసుకొచ్చాం: విదేశాంగ శాఖ
ఇరాక్ లోని నజఫ్ నుంచి ఇవాళ 60 మంది భారతీయుల్ని తీసుకొచ్చామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఢిల్లీలో విదేశాంగ శాఖాధికారులు మాట్లాడుతూ, మరో 600 మందిని భారతదేశం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇరాక్ లో ఉన్న భారతీయులందర్నీ వెనుకకు రప్పించేందుకు చర్యలు చేపట్టామని, వీలైనంత త్వరగా వారిని స్వదేశం చేరుస్తామని వారు హామీ ఇచ్చారు.