: చెన్నై బాధితులను పరామర్శించిన చిరు, బొత్స
చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ప్రదేశాన్ని కాంగ్రెస్ నేతలు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్యలు సందర్శించి, పరిశీలించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. బాధిత కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.