: రాకెట్లతో విరుచుకుపడిన ఉగ్రవాదులు
పాలస్తీనా ఉగ్రవాదులకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకరపోరు జరుగుతోంది. పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడికి దిగారు. పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై పది పేలుడు పదార్థాలను ప్రయోగించినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా, ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు ప్రతీకార దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రకటించింది. గాజాలోని ఉగ్రవాదుల స్థావరం లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు.