: ఎన్నికలపై చర్చిద్దామని పిలిచి... విద్యార్థి నాయకుడ్ని కాల్చేశారు


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. త్వరలో జరుగనున్న విద్యార్థి ఎన్నికలపై చర్చిద్దాం రమ్మని పిలిచి విద్యార్థి నాయకుడ్ని హత్య చేశారు దుండగులు. వారణాసిలోని సిగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో అభిషేక్ కుమార్ సింగ్ (23) మహాత్మా కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతడిని కొంత మంది వ్యక్తులు త్వరలో జరుగనున్న విద్యార్థి సంఘం ఎన్నికలపై చర్చించాలి, సిద్ధగిరిబాగ్ సమీపంలోని శ్మశానం దగ్గరకు రావాలని ఫోన్ చేసి పిలిచారు. అక్కడ వాగ్వాదం పెరగడంతో అతడిని కాల్చేశారు. బైక్ పై పారిపోవాలని ప్రయత్నించినా వెంటపడి కాల్చిచంపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ డ్రైవ్ చేస్తున్న మనోజ్ కుమార్ సింగ్ తప్పించుకోగలిగాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News