: కర్ణాటక గవర్నర్ గా రోశయ్య ప్రమాణస్వీకారం
తమిళనాడు గవర్నర్ రోశయ్య నేడు కర్ణాటక గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం ఆయనతో బెంగళూరు రాజ్ భవన్ లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీహెచ్ వాఘేలా ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రానికి నూతన గవర్నర్ ను నియమించే వరకు రోశయ్య గవర్నర్ గా వ్యవహరిస్తారు. హెచ్ఆర్ భరద్వాజ్ కర్ణాటక గవర్నర్ గా బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. శనివారం రాజ్ భవన్లో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.