: దిండి రిజర్వాయర్ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: హోంమంత్రి నాయిని
నల్గొండ జిల్లా దిండి రిజర్వాయర్లో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మరణించిన ఘటనపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారావు స్పందించారు. ఈ మేరకు వెంటనే అక్కడికి వెళ్లాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఘటనపై నివేదిక అందాక ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.