: పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాజీనామా
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ రాజీనామా చేశారు. 2010 జనవరి 24 నుంచి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ గా పని చేసిన ఆయనను యూపీఏ ప్రభుత్వం గవర్నర్ గా నియమించింది. నక్సల్ ప్రభావం తీవ్రంగా ఉండే పశ్చిమ బెంగాల్ లో హింసను అరికట్టాలనే ఉద్దేశంతో, భద్రతా రంగంలో ఆయనకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకునేందుకు యూపీఏ ప్రభుత్వం ఆయనను పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించింది.