: కూలిన భవనాన్ని పరిశీలించిన చంద్రబాబు
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెన్నై చేరుకున్నారు. చెన్నైలో కూలిన బహుళ అంతస్థుల భవనాన్ని ఆయన సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, జరుగుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబీకులను కలసి ఓదార్చారు. మృతుల్లో విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. కాగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారు ప్రాణాలతో ఉండే అవకాశం కూడా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.