: ఉప్పల్-మెట్టుగూడ మార్గంలో నిలిచిన మెట్రో పనులు
హైదరాబాదులోని ఉప్పల్-మెట్టుగూడ మార్గంలో మెట్రో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్న కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దాంతో, ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థకు, కాంట్రాక్టర్లకు మధ్య వివాదం తలెత్తింది. ఇదిలా ఉంటే సుల్తాన్ బజార్, అసెంబ్లీ పలు ప్రాంతాల్లో భూగర్భ మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షరతు పెట్టారట. దాంతో, అధికారుల్లో మరింత గందరగోళం ఏర్పడింది.