: కాంట్రాక్టర్ల కోసం పనులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం: మంత్రి హరీష్ రావు
చిన్న నీటిపారుదలను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతులు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని... వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంట్రాక్టర్ల కోసం పనులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని అధికారులను హెచ్చరించారు. ఈరోజు ఆయన అన్ని జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో చేసిన తప్పులు మళ్లీ పునరావృతమైతే సహించమని అన్నారు.