: మన వాళ్లే కాదు ... పాక్ అధికారులూ అంతే!


పాకిస్థాన్ అధికారుల ఘనతకు నిదర్శనమీ ఘటన. పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా సోదరి ఫాతిమా జిన్నాకు పాక్ నీటి సరఫరా అధికారులు బిల్లు పంపించారు. బిల్లు మొత్తాన్ని పది రోజుల్లోగా చెల్లించాలని అందులో పేర్కొన్నారు. లేని పక్షంలో తాగునీరు, మురుగునీటి కనెక్షన్లు తొలగిస్తామని కరాచీ వాటర్ అండ్ సివరేజ్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మొత్తం చెల్లించని పక్షంలో ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకోవచ్చని, లేదా జరిమానా విధించవచ్చని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. నోటీసు ప్రకారం మే 28 లోగా మొత్తం బిల్లు చెల్లించాలి. బిల్లు అందలేదని చెప్పే వీలు లేదు.

అయితే ప్రస్తుతం ఆ ఇంటిని మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. అందులో జిన్నా, ఆయన సోదరి వినియోగించిన వస్తువులను భద్రపరిచారు. ఆ ఇంటిని జిన్నా 1944లో 1.50 లక్షల రూపాయలు పెట్టి కొన్నారు. 1948 సెప్టెంబర్ లో ఫాతిమా ఆ ఇంట్లోకి వెళ్లి 1964 వరకు ఉన్నారు. 1965 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆ ఇల్లు ఖాళీ చేశారు. 1967లో ఆమె కాలం చేశారు. విషయం మీడియాలో ప్రసారం కావడంతో కరాచీ మున్సిపల్ కమిషనర్ వాటర్ బోర్డు అధికారిని పిలిచి చీవాట్లు పెట్టి నోటీసు వాపస్ తీసుకోవాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News