: ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్ రోశయ్య అభినందనలు
పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ రోశయ్య అభినందనలు తెలిపారు. "ప్రయోగం విజయవంతం కావడం చాలా గర్వకారణం. ఇస్రో పయనంలో ఇదొక చారిత్రాత్మక విజయంగా మిగిలిపోతుంది. స్పేస్ సైన్స్ టెక్నాలజీలో మనం ద్వితీయ స్థానంలో ఉన్నామని నిరూపించుకున్నాం. భారత్ సూపర్ పవర్ గా మారే రోజు ఎంతో దూరంలో లేదు" అంటూ గవర్నర్ పేరు మీద ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంతేగాక ఇస్రో ఛైర్మన్ డా.కె.రాధాకృష్ణన్, శాస్త్రవేత్తలు, మిగతా టీమ్ కు తన శుభాకాంక్షలు తెలియజేశారు.