: 'డయల్ యువర్ సీఎం'కు 420 నెంబర్ కేటాయించాలి: రేవంత్ రెడ్డి


సర్కారుపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, 'డయల్ యువర్ సీఎం'కు 420 నెంబర్ కేటాయించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 420 మంత్రులకు సీఎం నాయకత్వం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు 420 కేసుల్లో ఇరుక్కుంటున్నా సీఎం చలించడంలేదని రేవంత్ విమర్శించారు. ఇక సచివాలయంలోని సమతా బ్లాక్ ను జైలుగా మార్చారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News