: గెయిల్ పైప్ లైన్ పనులు అడ్డుకున్న గ్రామస్థులు
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో గెయిల్ వేస్తున్న పైప్ లైన్ పనులను గ్రామస్థులు అడ్డుకున్నారు. నగరంలో జరిగిన దుర్ఘటన భవిష్యత్తులో తమ గ్రామంలో చోటు చేసుకోకూడదని, గెయిల్ పైప్ లైన్ పనులు జరగనివ్వమని గ్రామస్థులు తేల్చిచెబుతున్నారు. తమ ప్రాణాలతో చెలగాటం అడవద్దని, తక్షణం పనులు ఆపేసి వెనుదిరగాలని కార్మికులకు సూచిస్తున్నారు.