: బిడ్డను నీటి తొట్టెలో వేసి చంపేసింది


చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లే బిడ్డను కడతేర్చింది. పది రోజుల శిశువును ఆమె తల్లే నీటి తొట్టెలో వేసి చంపేసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పసిబిడ్డ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఇతర కుటుంబ సభ్యులనూ విచారిస్తున్నారు. ఆడపిల్ల కావడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా, రెండో సంతానం కూడా ఆడపిల్లే కావడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News