: యాక్టర్లకు ద్వారాలు తెరిచిన 'దీదీ'


పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సినీ, టీవీ నటులపై అపార వాత్సల్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ లో వారికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే లోకేత్ చటర్జీ, నయనా బందోపాధ్యాయ వంటి నటులను కమిషన్ లో నియమించిన దీదీ... తాజాగా జూనే మలియాను సభ్యురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, కమిషన్ లో సభ్యులుగా ఉన్న నటులందరికీ తగిన అర్హత ఉందా అన్న ప్రశ్నకు కమిషన్ చైర్ పర్సన్ సునందా ముఖర్జీ బదులిస్తూ, కమిషన్ అర్హతల చట్టాన్ని అనుసరించి నిరసనలు, ఉద్యమాలు, ధర్నాల్లో పాల్గొని ఉండాలని తెలిపారు. అయితే, ఈ నట సభ్యులను అలాంటి కార్యక్రమాల్లో ఎక్కడా చూళ్ళేదని సునంద చెప్పడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News