: పొలార్డ్ ఇన్... గేల్ అవుట్


న్యూజిలాండ్ తో జరుగనున్న రెండు టీ20 మ్యాచ్ లు ఆడేందుకు విండీస్ టీ20 స్పెషలిస్టు బ్యాట్స్ మన్ కీరన్ పొలార్డ్ కు పిలుపొచ్చింది. పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయిన పొలార్డ్ ను గేల్ స్థానంలో పిలవనున్నారు. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన గేల్ జర్మనీలో చికిత్స తీసుకున్నప్పటికీ పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. ఫిట్ నెస్ సాధించకుండా రెండు టెస్టులు ఆడి రెండు అర్థ సెంచరీలు చేయడంతో గేల్ కు గాయాలు తిరగబెట్టాయి. దీంతో టీ20ల్లో అతని స్థానంలో ఆడేందుకు పొలార్డ్ ను న్యూజిలాండ్ రప్పించారు. దీంతో ఏడాది తరువాత పొలార్డ్ విండీస్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

  • Loading...

More Telugu News