: గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ల సమ్మె
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలను జూడాలు బహిష్కరించారు. నిన్న రాత్రి విధుల్లో ఉన్న ఓ జూనియర్ డాక్టర్ పై ఓ రోగి బంధువులు దాడి చేశారు. రోగిని సరిగా చూడటం లేదని వీరు దాడి చేశారు. ఈ నేపథ్యంలో, తమపై తరచుగా దాడులు జరుగుతున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో తాము ఉద్యోగాలు చేయలేమని జూడాలు అంటున్నారు.