: ఆ యాడ్ వల్ల ఉపయోగం ఎంత?: దర్శకుడు
క్యాన్సర్ కారకమైన పొగాకు నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండడం లేదని సినీ దర్శకుడు ప్రియదర్శన్ అభిప్రాయపడ్డారు. గత రెండేళ్ల నుంచి సినిమా థియేటర్లలో పొగాకు వాడకంపై ప్రకటనలు ఇస్తున్నా దాని వల్ల ప్రయోజనం ఎంత? అని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రకటన వల్ల రాబోయే తరానికి ఉపయోగం ఉన్నప్పటికీ, ప్రజలను తక్షణం పొగాకు బారి నుంచి రక్షించాలంటే సిగిరెట్ల అమ్మకం నిలిపేయాలని ఆయన సూచించారు.