: కొత్త యాప్ ఆవిష్కరించిన భారత పర్యాటక శాఖ
భారత్ లో పర్యటించే యాత్రికుల కోసం భారత పర్యాటక శాఖ సరికొత్త యాప్ ను ఆవిష్కరించింది. ఇంక్రెడిబుల్ ఇండియా వాకింగ్ టూర్స్ పేరిట రూపుదిద్దుకున్న ఈ యాప్ లో 16 భారత నగరాలకు చెందిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. జెనెసిస్ ఇంటర్నేషనల్ సహకారంతో ఈ సెల్ఫ్ గైడెడ్ యాప్ ను రూపొందించారు. ఆగ్రా, అమృత్ సర్, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా తీరప్రాంతం, హైదరాబాద్, జైపూర్, కోల్ కతా, ముంబయి, పాట్నా, పుణే, సూరత్ వంటి నగరాలకు చెందిన సమస్త సమాచారం ఈ యాప్ ద్వారా పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది.
అయితే, ప్రస్తుతానికి ఈ యాప్ బ్లాక్ బెర్రీ ఫోన్ల (జెడ్3, జెడ్10,జెడ్30, క్యూ5,క్యూ10)కు మాత్రమే ఉద్దేశించారు. త్వరలో ఆండ్రాయిడ్ వెర్షన్ ను కూడా రూపొందించనున్నట్టు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.