: సాయిబాబా ఓ ముస్లిం: శంకరాచార్య మరో వివాదాస్పద వ్యాఖ్య
ద్వారకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలకు తెరదీశారు. తాజాగా, సాయిబాబా ఓ ముస్లిం అని పేర్కొన్నారు. తాను ముస్లింనని సాయి స్వయంగా పేర్కొనేవారని, పవిత్ర గంగానదిలో కూడా మునిగేవారు కారని శంకరాచార్య తెలిపారు. ఆయనే తాను ముస్లింనని చెప్పుకున్నప్పుడు, భక్తులు ఆయన ప్రతిమతో గంగానదిలో ఎలా మునుగుతారని ఈ ద్వారకాపీఠాధిపతి ప్రశ్నించారు.
సాయిబాబాపై ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొన్నిరోజుల క్రితం సాయిబాబా దేవుడు కాదని, పూజించరాదని వ్యాఖ్యానించి వివాదాల తేనెతుట్టెను కదిల్చారు. దీంతో, ఈ స్వామివారిపై షిరిడిలో కేసు కూడా నమోదైంది.