: నెరవేరిన మోడీ ఆరేళ్ల స్వప్నం
భారత ప్రధాని నరేంద్ర మోడీ చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరింది. 2008 అక్టోబర్ 22న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చంద్రయాన్-1 ప్రయోగాన్ని వీక్షించారు. అయితే, ఆయన వీక్షించింది షార్ అంతరిక్ష కేంద్రం నుంచి కాదు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ నుంచి స్క్రీన్ మీద ఆయన వీక్షించారు. ఆరోజు ఆయన మాట్లాడుతూ, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం చిక్కలేదని... ఎప్పటికైనా శ్రీహరికోట కేంద్రం నుంచి ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తానని చెప్పారు. ఈ రోజు భారత ప్రధాని హోదాలో ఆయన తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు.