: మరికాసేపట్లో పీఎస్ఎల్వీ-సి23 ప్రయోగం
పీఎస్ఎల్వీ-సి23 వాహకనౌక మరికాసేపట్లో శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్ళనుంది. ఈ ఉదయం 9.52 నిమిషాలకు రాకెట్ ను ప్రయోగిస్తారు. ఈ ప్రయోగం కోసం శనివారం నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు భారత ప్రధాని మోడీ, గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు షార్ కేంద్రానికి విచ్చేశారు. ఈ వాహకనౌక సాయంతో 5 విదేశీ శాటిలైట్లు, ఇస్రోకు చెందిన అడ్వాన్స్ డ్ ఇంటర్నల్ నేవిగేషన్ సిస్టమ్ పేలోడ్ ను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.