: ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమైన మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ షార్ కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు, ఆయన పీఎస్ఎల్వీ ప్రయోగ వేదికను పరిశీలించారు. మోడీ వెంట గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్ తదితరులు ఉన్నారు.