: మోడీకి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు


భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీహరికోటకు చేరుకున్నారు. ఇప్పటికే అక్కడకు చేరుకున్న గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చెన్నై వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన మోడీ అక్కడ నుంచి షార్ కు హెలికాప్టర్ లో విచ్చేశారు. రేపు జరగనున్న పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని వీరు వీక్షించనున్నారు. షార్ లోని భాస్కర అతిథి గృహంలో ఈ రాత్రికి మోడీ బస చేస్తారు.

  • Loading...

More Telugu News