: గోదావరి పుష్కరాలకు సిద్ధమవుతున్న రైల్వే శాఖ


గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్కరాలకు రైల్వే శాఖను సిద్ధం చేస్తున్నామని విజయవాడ డివిజన్ రీజనల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ రోజు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి తదితరులతో కలసి ఆయన రాజమండ్రి మెయిన్ స్టేషన్, గోదావరి స్టేషన్లను పరిశీలించారు. పుష్కారాల సమయంలో గోదావరి స్టేషన్ లోనే ఎక్కువ మంది దిగుతారని... అందువల్ల ఈ స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారుచేస్తున్నామని డీఆర్ఎం ప్రదీప్ తెలిపారు.

  • Loading...

More Telugu News