: నేడు శ్రీహరికోటకు ప్రధాని మోడీ రాక
ప్రధాని నరేంద్రమోడీ నేటి సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు రానున్నారు. రేపు ఉదయం 9.52 గంటలకు షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ23 రాకెట్ ను ప్రయోగించనున్న సంగతి తెలిసిందే. దీన్ని చూసేందుకు ప్రధాని విచ్చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో షార్ కు చేరుకుంటారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు సాయంత్రం లోపు షార్ కు చేరుకోనున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.