: మెస్సీని చూస్తుంటే... నాకు మరేదానిపైనా ఆసక్తి ఉండదు: విద్యాబాలన్
అర్జెంటీనా సాకర్ స్టార్ లియొనెల్ మెస్సీని ప్రపంచ వ్యాప్తంగా పిచ్చిపిచ్చిగా అభిమానించేవారికి కొదవలేదు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ సుందరి విద్యాబాలన్ కూడా చేరింది. ఫుట్ బాల్ అంటే తనకు పెద్దగా ఆసక్తి లేకపోయినా... మెస్సీ అంటే మాత్రం చాలా ఇష్టమని విద్యాబాలన్ చెప్పింది. "మెస్సీ అందగాడు కాబట్టే అతను నాకు తెలుసు. మెస్సీ మ్యాచ్ లు ఎప్పుడు వున్నాయనే విషయం నా స్నేహితులు నాకు చెబుతారు. నేను వెంటనే టీవీ ముందు కూర్చుంటా. ఆ సమయంలో నాకు మరేదానిపైనా ఆసక్తి ఉండదు " అంటూ చెప్పుకొచ్చింది, ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు.