: ఆపరేషన్ అబద్దమని నిరూపిస్తే కాళ్ళు పట్టుకుంటా : షర్మిల


తనపై విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ పార్టీ నేత షర్మిల మండిపడ్డారు. తన మోకాలికి ఆపరేషన్ జరగలేదని నిరూపిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్లు పట్టుకుంటానని...'ఒకవేళ నా మోకాలికి ఆపరేషన్ జరిగిందని తేలితే నా కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతారా?' అని ఆమె సవాల్ విసిరారు. 

'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా 
శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించిన ఆమె టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా-మీ కోసం' పాదయాత్ర ఒక పెద్ద బూటకమని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు పాలించిన తొమ్మిదేళ్లు, ప్రజలకు శాపమన్న షర్మిల.. అధికార, ప్రతిపక్ష నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని ఆమె  ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News