: వందరోజుల ప్రణాళిక సిద్ధం చేయండి: మంత్రులతో చంద్రబాబు
హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు తమ శాఖల పనితీరుపై వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఆయా శాఖల్లోని అవినీతి అంశాలను యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని యాంటీ కరెప్షన్ సబ్ కమిటీకి అప్పగించాలని ఆయన చెప్పారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బాబు తన మంత్రివర్గ సహచరులకు చెప్పారు.