: స్టూడియో నిర్మాణంలో అక్రమాలకు పాల్పడలేదు: నాగార్జున


మీడియాలో తనపై వస్తున్న కథనాల పట్ల టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పందించారు. అన్నపూర్ణ స్టూడియో విస్తరణలోనూ, మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలోనూ పలు అవకతవకలకు పాల్పడ్డట్టు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని నాగార్జున చెప్పాడు. కొండలను కరిగించి అన్నపూర్ణ స్టూడియో నిర్మించామని, ఎలాంటి అక్రమాలకు తెరదీయలేదని స్పష్టం చేశాడు. స్టూడియో స్థలం కొనుగోళ్ళ వ్యవహారంలో పూర్తి నగదు చెల్లించే లావాదేవీలు జరిపామని నాగ్ వెల్లడించాడు. ఇందుకు సంబంధించి డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని తెలిపారు.

ఇక తనకు తెలిసింది సినిమానేనని చెబుతూ, రాజకీయాల్లోకి వచ్చేదిలేదని మరోసారి కరాఖండీగా చెప్పాడు. కాగా, ఇటీవల తరచుగా చంచల్ గూడ జైలుకు వెళ్ళడంపై వివరణ ఇస్తూ, తన స్నేహితుడు నిమ్మగడ్డను కలిసేందుకే అక్కడికి వెళ్ళానన్నాడు. అక్రమాస్తుల కేసులో సిబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఇదే జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News