: అంతర్వేది వద్ద లీకవుతున్న గ్యాస్
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది మండలం పల్లిపాలెం వద్దనున్న గెయిల్ గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకవుతోంది. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. రాజమండ్రి దగ్గర శింగవరం గ్రామంలో గెయిల్, హెచ్పీకి చెందిన గ్యాస్ పైప్ లైన్లు పొలాల్లో బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు గెయిల్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ ప్రాణాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. దుర్ఘటనలు జరిగినా అధికారుల్లో అలసత్వం పోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదయినా ప్రమాదం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.