: ఫుట్ బాల్ తొలి రౌండ్ లో జట్టు ఇంటి ముఖం పట్టిందని...మంత్రికి ఊస్టింగ్ ఆర్డర్?


ఆటలో ఏదైనా జట్టు ఓటమిపాలైతే ఆటగాళ్లపై శిక్ష పడుతుంది. ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్ ను తొలగిస్తారు. లేదా పేలవమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లను మార్చేస్తారు. ఇంకా అవసరమైతే కోచ్ ను మారుస్తారు. అంతే కానీ, క్రీడల మంత్రిని తప్పుపట్టరు. కానీ, 'ఘనా జట్టు ఓటమికి కారణం' అంటూ క్రీడల శాఖ మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు సిద్ధమైంది ఆ ప్రభుత్వం. బ్రెజిల్ లో జోరుగా జరుగుతున్న సాకర్ ఫుట్ బాల్ లో ఘనా జట్టు పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.

గత రెండు వరల్డ్ కప్ లలో అంచనాలు లేకుండా బరిలో దిగిన ఘనా ఫుట్ బాల్ జట్టు అద్భుతంగా రాణించి నాకౌట్ దశకు చేరింది. దాంతో ఘనా ప్రభుత్వం తమ జట్టును ప్రోత్సహించాలని భావించి 500 మంది అభిమానులను ప్రత్యేకంగా బ్రెజిల్ కు తీసుకెళ్లింది. గ్రూప్ ఆఫ్ డెత్ లో ఉన్న ఘనా జట్టు అంచనాల ప్రకారం ఆడలేకపోయింది. దీంతో అభిమానులను నిరాశకు గురి చేస్తూ తొలి రౌండ్ దాటలేకపోయింది. దీంతో క్రీడా శాఖను ప్రక్షాళన చేయాలని ఘనా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో క్రీడల మంత్రిని తొలగించేందుకు సిద్ధమైంది.

  • Loading...

More Telugu News