: 4,380 మద్యం దుకాణాలకు ఆంధ్రప్రదేశ్ లో లైసెన్స్ నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల అనుమతికి వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొత్తం 3,637 మద్యం దుకాణాలకు 48,894 దరఖాస్తులు వచ్చాయి. అయితే, 4,380 మద్యం దుకాణాలకు లైసెన్స్ నోటిఫకేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ క్రమంలో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 473 దుకాణాలకు గానూ 7,514 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా కడప జిల్లాలో 269 దుకాణాలకు వెయ్యి 754 దరఖాస్తులు వచ్చాయి. ఇక 743 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.122.23 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. అటు కోర్టు ఆదేశాలతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 173 దుకాణాల లైసెన్స్ ల జారీని నిలిపివేశామన్నారు.