: సైనిక సమస్యతో సతమతమౌతున్న అమెరికా


సైనిక సమస్యతో పెద్దన్న సతమతమవుతున్నాడు. ఫ్యాషన్ మోజు అగ్రరాజ్యానికి సైనిక సమస్యను తెచ్చిపెడుతోంది. టాటూలు (పచ్చబొట్లు) అంటే అమెరికా యువతకు పిచ్చి. అయితే, పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్లని సైన్యంలో చేర్చుకోరు. ఈ వెర్రితో బాటు పియర్సింగ్ (చెవులకు పోగులు) పిచ్చి అక్కడి కుర్రాళ్ళలో ఎక్కువవడంతో అమెరికాకు సైనికులు లేకుండా చేస్తోంది. />
మామూలుగా టాటూలు ఒక్కసారి పొడిపించుకుంటే ఏడాది వరకు శరీరం నుంచి కనుమరుగుకావు. దాంతో సైన్యంలో చేరాలనే కోరిక చాలా మందిలో ఉన్నా అర్హత సాధించలేకపోతున్నారు. దీంతో 71 శాతం అమెరికన్ యువత సైన్యంలో చేరలేకపోతోంది. అమెరికా సైన్యంలో చేరాలంటే 17 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వారై ఉండాలి. ఆర్మీ రాత పరీక్షలో పాసవ్వాలి. ఇన్సులిన్ తీసుకునేంత షుగర్ ఉండకూడదు. పచ్చబొట్లు పొడిపించుకోకూడదు.

చెవులకు పియర్సింగ్ చేయించుకోకూడదు. నేర చరిత్ర ఉండకూడదు. మాదక ద్రవ్యాలు వాడకూడదు. ఇవన్నీ చాలవన్నట్టు అమెరికన్ యువకుల్లో సగం మంది ఊబకాయులు. వీరంతా అమెరికా సైన్యంలో చేరేందుకు పనికిరారు. అమెరికా అగ్రరాజ్యంగా వర్థిల్లాలన్న కాంక్షతో ఆ దేశం పలు దేశాల్లో సైనిక చర్యలు జరుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సైనిక స్థావరాలున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న సైనిక అవసరాలకు అనుగుణంగా సిబ్బంది లేరు. దీంతో పెద్దన్నను సైనిక సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

  • Loading...

More Telugu News