: మీరట్ లో రోడ్డు ప్రమాదం... ఆంధ్రుడు మృతి
మీరట్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నాగోజిపేటకు చెందిన వారు. యమునా నది పుష్కరాలకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు.