: రేపటి నుంచి రంజాన్ మాసం
ముస్లింలకు పరమ పవిత్రమైన పర్వదినం రంజాన్. ఈ సందర్భంగా వారు నెలరోజుల పాటు ఉపవాసాలతో దీక్ష ఆచరిస్తారు. ఈ క్రమంలో రేపటి నుంచి రంజాన్ మాసం షురూ కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రార్థనలు జరుపుకునేందుకు వీలుగా నాలుగు గంటలకే వారు ఆఫీసులు వదిలి వెళ్ళేందుకు అధికారులు అనుమతించాలని కేసీఆర్ ఆదేశించారు.