: సోషల్ మీడియాను ఉపయోగించుకోండి: మోడీ
భారతీయ జనతా పార్టీ తరుపున కొత్తగా ఎన్నికైన ఎంపీలందరూ సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బీజేపీ తరపున కొత్తగా ఎన్నికైన ఎంపీల కోసం సూరజ్ కుండ్ లో ఏర్పాటు చేసిన వర్క్ షాపులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను ఎంపీలందరూ ప్రభావవంతంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.