: భయాందోళనలో భద్రాచలం విద్యార్థులు... ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించదా?


ఫీజు రీయింబర్స్ మెంటు భద్రాచలం డివిజన్లో వివాదాస్పదం కానుంది. 1956కు ముందు నుంచి తెలంగాణలో ఉన్నవారికే ఫీజు రీయింబర్స్ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనతో భద్రాచలం డివిజన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, భద్రాచలం డివిజన్ 1959 వరకు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. గోదావరి నదికి వరదలు వచ్చినపుడు పునరావాస చర్యలు చేపట్టడం అధికారగణానికి కష్టంగా ఉండేది. 1957లో ఖమ్మం జిల్లా ఏర్పడటంతో తమను ఖమ్మం జిల్లాలో చేర్చాలని భద్రాచలం డివిజన్ ప్రజలు కోరారు. దీంతో, 1959లో ఈ డివిజన్ ను తూర్పుగోదావరి జిల్లా నుంచి విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. 1960లో అధికారికంగా గెజిట్ అయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఆలోచన భద్రాచలం డివిజన్ (భద్రాచలం పట్టణం, దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల) వాసుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

  • Loading...

More Telugu News