: అమెరికా అగ్నికి ఆజ్యం పోస్తోంది: రష్యా ఆరోపణ
ఉక్రెయిన్ అంశంలో అమెరికా చర్యలు ఉద్రిక్తతను మరింత పెంచేవిగా ఉన్నాయని రష్యా ఆరోపిస్తోంది. తమకు సవాల్ విసిరేలా ఉక్రెయిన్ నాయకత్వాన్ని అమెరికా ప్రోత్సహిస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, రష్యాపై తాజా ఆంక్షలు విధించే విషయంలో మరికొంతకాలం వేచిచూడాలని ఈయూ సమావేశంలో తీర్మానించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ఏర్పడిన అస్థిరత విషయంలో దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు రష్యా అధినాయకత్వానికి, రష్యా అనుకూల సాయుధులకు మరికొంత గడువు ఇవ్వాలని ఈయూ నిర్ణయించింది.