: పేలుడు ప్రాంతాన్ని సందర్శించిన వీహెచ్... గో బ్యాక్ అంటూ నినాదాలు
తూర్పుగోదావరి జిల్లాలో సంభవించిన గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు ప్రాంతాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సందర్శించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ తో కలసి ఆయన ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. వీహెచ్ గోబ్యాక్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ, తనను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. దేశంలో దారుణమైన ఘటనలు ఎక్కడ జరిగినా తాను వెళతానని... బాధితుల పక్షాన నిలబడతానని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 30 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.