: క్షతగాత్రులను హైదరాబాదుకు తరలించి చికిత్స చేయిస్తాం: చినరాజప్ప
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు ప్రమాదంలో క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించాలని యోచిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. కేంద్ర ఉన్నతస్థాయి కమిటీకి ప్రభుత్వం తరపున పరిస్థితిని వివరించామని ఆయన తెలిపారు. చమురు కంపెనీల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు.